అమెరికా నుంచి సిద్ధమవుతోన్న కరోనా వ్యాక్సిన్లు

  • ఫైజర్, మోడెర్నా ప్రయత్నాలు
  • వచ్చేనెల‌ 25 నాటికి టీకా ఆమోదం పొందాలని లక్ష్యం
  • విస్తృతంగా లభించడానికి కొన్ని నెలల సమయం పట్టే ఛాన్స్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ ఆమోదం పొందాలంటే ఎన్నో ప్రక్రియలు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. వాటికి అనుమతుల కోసం కూడా చాలా సమయం ఎదురుచూడాల్సి వస్తుంది. అయితే, వ్యాక్సిన్ ను తీసుకొచ్చే రేసులో ముందు వరసలో ఉన్న అమెరికాలోని ఫైజర్, మోడెర్నా తాజాగా కీలక ప్రకటన చేశాయి.

వచ్చేనెల‌ 25 నాటికి టీకా ఆమోదం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నామని  మసాచుసెట్స్‌ బయోటెక్‌ సంస్థ మోడెర్నా కంపెనీ చైర్మన్‌, సీఈఓ అల్బర్ట్‌ బౌర్లా చెప్పారు. కాగా, నవంబర్‌ లో టీకాలు ఆమోదం పొందినప్పటికీ, అవి విస్తృతంగా లభించడానికి కొన్ని నెలల సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. అయితే, అత్యవసర ఆమోదం పొందినా అవి ఎంతమాత్రం పనిచేస్తాయోనని మరి కొందరు అనుమానిస్తున్నారు.

అమెరికన్‌ వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు మాత్రం కరోనా  వ్యాక్సిన్‌ల అత్యవసర ఆమోదం కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నాయి. ఒకవేళ  అనుమతి వచ్చినప్పటికీ, ఆ తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయంపై అమెరికా సంస్థలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి.


More Telugu News