చూడముచ్చటగా ఉండే కొత్త రకం చేపను గుర్తించిన సీఎం ఉద్ధవ్ థాకరే తనయుడు!

  • స్కిస్తురా హిరణ్యాక్షి అని కొత్త రకం చేపకు పేరు
  • ఆక్సిజన్ ఎక్కువగా కలిగిన చెరువుల్లో కనిపించే చేప
  • ఆక్వా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇక్తాలజీలో వివరాలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు తేజస్ థాకరే మరికొందరితో కలిసి అత్యంత అరుదైన స్కిస్తురా జాతికి చెందిన కొత్త రకం చేపను కనుగొన్నారు. ‘దీనికి స్కిస్తురా హిరణ్యాక్షి’ అని పేరు పెట్టారు. హిరణ్యాక్షి నదిలో కనిపించడంతో దీనికా పేరు పెట్టారు. అలాగే, బంగారపు రంగు జుట్టు కలిగినది అనే మరో అర్థం కూడా హిరణ్యాక్షికి ఉంది. ఐసీఏఆర్ ఇనిస్టిట్యూట్ పోర్టుబ్లెయిర్‌కు చెందిన జయసింహన్ ప్రవీణ్‌రాజ్, అండర్ వాటర్ ఫొటోగ్రాఫర్ శంకర్ బాలసుబ్రహ్మణ్యన్ కలిసి పశ్చిమ కనుమలలో ఈ అరుదైన చేపను గుర్తించారు.

ఈ చేప చిన్నగా చూడముచ్చటగా ఉంది. పైన బంగారపు వర్ణంలో వెంట్రుకలు ఉన్నాయి. హిరణ్యాక్షి చేపలు ఆక్సిజన్ ఎక్కువగా ఉండే మంచినీటి చెరువులు, నదుల్లోనే కనిపిస్తుంటాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. తేజస్ 2012లో తొలిసారి ఈ చేపను కనుగొన్నారని, 2017లో ఇదే జాతికి చెందిన మరిన్ని చేపలను కనుగొన్నట్టు ప్రవీణ్‌రాజ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఆక్వా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇక్తాలజీలో ప్రచురితమయ్యాయి.


More Telugu News