వివేక్ ఒబెరాయ్ కు బిగుస్తున్న ఉచ్చు.. విచారించాల్సిందేనన్న మహారాష్ట్ర హోంమంత్రి
- డ్రగ్స్ వ్యవహారంలో వివేక్ ఇంట్లో సోదా చేసిన బెంగళూరు పోలీసులు
- వివేక్ ను ఎన్సీబీ విచారించాలన్న అనిల్ దేశ్ ముఖ్
- లేని పక్షంలో ముంబై పోలీసులను విచారించమని కోరతాం
డ్రగ్స్ అంశంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో వివేక్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించాలని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ లింకులకు సంబంధించి ముంబైలోని వివేక్ నివాసంలో బెంగళూరు పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన తర్వాత కొందరు కాంగ్రెస్ నేతలు అనిల్ దేశ్ ముఖ్ ను కలిశారు. అనంతరం ఆయన ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఎన్సీబీ విచారణ జరపకపోతే... విచారణ జరపాల్సిందిగా ముంబై పోలీసులను కోరుతామని చెప్పారు.
ఇటీవలి కాలంలో బీజేపీతో మహారాష్ట్రలోని శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం యుద్ధమే చేస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం, కంగనా రనౌత్ అంశాల నేపథ్యంలో ఇది మరింత ముదిరింది. వివేక్ ఒబెరాయ్ కూడా బీజేపీకి పెద్ద మద్దతుదారుడిగా ఉన్నారు. ప్రధాని మోదీ బయోపిక్ లో ఆయన పాత్రను ఒబెరాయ్ పోషించారు.