కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది: సుజనా చౌదరి

  • తీవ్ర వాయుగుండంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
  • రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్న సుజనా
  • గ్రామాలు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడి
ఇటీవల తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రను భారీ వర్షాలు, వరదలు కుదిపేశాయి. ఆ విలయం నుంచి అన్నదాతలు ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పందించారు. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఏపీ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కృష్ణా నది వరద కారణంగా ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న పలు గ్రామాలు నీట మునిగాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వరద బాధితులకు సాయం చేయాలని కోరారు.


More Telugu News