బీజేపీ సాధించిన మరో విజయమిది: రాహుల్ గాంధీ వ్యంగ్యం
- ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ ఇచ్చిన అంచనాలు పోస్ట్
- మనకన్నా బంగ్లాదేశ్ జీడీపీ ఎక్కువ
- కరోనా వేళ పాక్, ఆఫ్ఘనిస్థాన్ చర్యలు భేష్ అన్న రాహుల్
దేశంలో కరోనా కేసులకు అడ్డుకట్టపడడం లేదన్న విషయం తెలిసిందే. ప్రతి రోజు వేలాది కేసులు నమోదవుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ పరిస్థితులు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఆయన ట్వీట్ చేస్తూ.. కరోనా కట్టడిలో భారత్ కన్నా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలు బాగా పనిచేశాయని చెప్పారు. మన దేశ ఆర్థిక వ్యవస్థపై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ఇచ్చిన అంచనాలను గుర్తు చేస్తూ గ్రాఫ్ పోస్ట్ చేశారు. బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, చైనా, భూటాన్, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘాన్ ఆర్థిక వ్యవస్థ గురించి ఇందులో వివరాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ కన్నా ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ 10.3 శాతం దిగజారిపోతుందని ఐఎంఎఫ్ పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘బీజేపీ సాధించిన మరో విజయమిది’ అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.