నా అభ్యర్థన మన్నించి కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభించారు: కేశినేని నాని ఆసక్తికర ట్వీట్
- విజయవాడలో నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్
- నితిన్ గడ్కరీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలన్న నాని
- గతంలో గడ్కరీ, చంద్రబాబుతో దిగిన ఫొటో పోస్ట్
విజయవాడలో నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు ప్రారంభించిన విషయం తెలిసిందే. కనకదుర్గ ఫ్లైఓవర్ గురించి మొదటి నుంచి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు చేస్తూ వస్తోన్న టీడీపీ నేత కేశినేని నాని ఈ సందర్భంగా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు.
‘నా అభ్యర్థన మన్నించి కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్.. విజయవాడ మచిలీపట్నం 4 వరుసల రహదారి ప్రారంభోత్సవం... 2,600 కోట్ల రూపాయల విజయవాడ బైపాస్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పడమర భాగం శంకుస్థాపన కార్యక్రమాలను వీడియోకాన్ఫరెన్స్ ద్వారా చేసిన
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. కాగా, గతంలో నితిన్ గడ్కరీతో పాటు చంద్రబాబుతో కలిసి దిగిన ఫొటోను, ఫ్లైఓవర్ ఫొటోను ఆయన పోస్టు చేశారు.