చంద్రబాబు నాయుడు చెప్పిన ఈ మాటలు నిజం కాదా?: దేవినేని ఉమ
- విపత్తులో ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది
- కానీ, ముంచడమే మీ ఎజెండానా?
- వాగుల పూడికతీత తీయరు
- ముంపు ప్రజారాజధానికి వస్తే ప్రభుత్వమే కారణమంటున్న రైతులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.
‘విపత్తులో ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వానికి ముంచడమే ఎజెండానా? వాగుల పూడికతీత తీయరు, డ్యాముల్లో నీటిని వదలరు, ఎత్తిపోతల మోటార్లు వేయరు. వందేళ్లలో రాని ముంపు ప్రజారాజధానికి వస్తే ప్రభుత్వమే కారణమంటున్న రైతులు, ప్రజల ప్రాణాలంటే వైకాపాకు లెక్కలేదన్న చంద్రబాబు నాయుడి మాటలు నిజం కాదా? వైఎస్ జగన్?’ అని దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు.
కాగా, అమరావతి ముంపునకు గురవుతుందని ప్రభుత్వం చేస్తోన్న విష ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలంటూ రైతులు మీడియాకు చెబుతున్న వీడియోలను ఈ సందర్భంగా దేవినేని పోస్ట్ చేశారు. దమ్ముంటే అమరావతి రాజధానిపై బహిరంగ చర్చకు వస్తారా? అని రైతులు ప్రశ్నించారు. మహా నగరాలు మునుగుతున్నా అమరావతి సేఫ్ గా ఉందని చెప్పారు.