ఈ అర్ధరాత్రి నుంచి లండన్ లో కరోనా నిబంధనలు మరింత కఠినతరం.. హై అలర్ట్!

  • లండన్ లో పెరుగుతున్న కేసులు
  • ప్రతి 10 రోజులకు రెట్టింపవుతున్న కేసులు
  • ఎవరూ కూడా మరెవరినీ కలవకూడదని ఆంక్షలు
దాదాపు 90 లక్షల మంది ప్రజలు నివసిస్తున్న లండన్ నగరంలో కరోనా నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ప్రస్తుతం మీడియం అలర్ట్ లో ఉన్న నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. తాజా నిబంధనలతో ఈ అర్ధరాత్రి నుంచి ఏ ఒక్కరు కూడా తమ ఇంటి వెలుపల మరెవరినీ కలవడానికి కుదరదు.

కామన్ స్పేస్ ను షేర్ చేసుకునే వ్యక్తులు సైతం ఒకరినొకరు కలవకూడదు. ఏదైనా మైదానం వంటి బహిరంగ ప్రదేశంలో ఏదైనా అత్యవసర సమావేశం జరిగినట్టైతే ఆరుగురికి మించి ఉండకూడదు. అదికూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని సమావేశాలు జరుపుకోవాలి. ఇదే సమయంలో ప్రతి ఒక్కరూ తమ ప్రయాణాలను వీలైనంత వరకు తగ్గించుకోవాలి.

ఈ సందర్భంగా యూకే ఆరోగ్య మంత్రి మ్యాట్ హ్యాంకాక్ మాట్లాడుతూ, లండన్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని... ప్రతి 10 రోజులకు కేసులు డబుల్ అవుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కరోనా విస్తరణను నియంత్రించేందుకు నిబంధనలను కఠినతరం చేస్తున్నామని తెలిపారు.


More Telugu News