కొండపోచమ్మ సాగర్ నిర్వాసితుల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట!

  • పెళ్లి కాని మేజర్ యువకులకు పరిహారం చెల్లించాలన్న హైకోర్టు
  • సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
  • హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిన సుప్రీం ధర్మాసనం
తెలంగాణలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులకు పరిహారం చెల్లింపు అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గతంలో ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా, పెళ్లి కాని మేజర్ యువతకు సైతం విడిగా పరిహారం చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పెళ్లి కాని మేజర్ యువకులు కుటుంబంలో భాగమేనని, వారిని విడిగా పరిగణించలేమని తెలంగాణ ప్రభుత్వం తమ వాదనను స్పష్టంగా వినిపించింది. వాదనలు విన్న పిమ్మట తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్ ధర్మాసనం స్టే ఇచ్చింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కాగా, ఇదే అంశంలో పరిహారానికి సంబంధించి ఇదివరకే దాఖలైన మరో పిటిషన్ ను కూడా సుప్రీం కోర్టు తన తాజా విచారణలో భాగం చేసింది.


More Telugu News