యూరప్ లో మళ్లీ కరోనా పంజా.. కుప్పకూలిన మార్కెట్లు!
- యూరప్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- అమ్మకాలకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
- 1,066 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
వరుసగా 10 సెషన్ల పాటు లాభాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. యూరప్ లో కరోనా కేసులు మళ్లీ పెరగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వారు అమ్మకాలకు మొగ్గు చూపారు. తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,066 పాయింట్లు పతనమై 39,728కి పడిపోయింది. నిఫ్టీ 290 పాయింట్లు పడిపోయి 11,680కి దిగజారింది.
అన్ని సూచీలు ఈరోజు నష్టాలను చవిచూశాయి. అత్యధికంగా టెలికాం, బ్యాంకింగ్ సూచీలు దెబ్బతిన్నాయి. బజాజ్ ఫైనాన్స్ (-4.68%), టెక్ మహీంద్రా (-4.32%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.94%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.91%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.60%)లు టాప్ లూజర్లుగా ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం ఏసియన్ పెయింట్స్ (0.32%) మాత్రమే లాభాల్లో ముగిసింది.