కరోనా పాజిటివ్ వ్యక్తులు రైలెక్కితే జరిమానా, జైలు శిక్ష: ఆర్‌పీఎఫ్

  • పండుగ ప్రయాణాల నేపథ్యంలో హెచ్చరికలు
  • కరోనా వ్యాప్తికి కారణమయ్యే ఏ పని చేసినా నేరంగానే పరిగణింపు
  • మార్గదర్శకాలు విడుదల చేసిన ఆర్‌పీఎఫ్
కరోనా సంక్రమించిన వ్యక్తులు రైలెక్కితే జరిమానా, జైలు శిక్ష తప్పవని రైల్వే భద్రత దళం (ఆర్‌పీఎఫ్) హెచ్చరించింది. పండుగల నేపథ్యంలో రైలు ప్రయాణాలకు జనం పోటెత్తనున్న నేపథ్యంలో ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటికి విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.

ముఖ్యంగా, కరోనా పరీక్షలు చేయించుకుని, ఫలితం రాకముందే స్టేషన్‌కు రావడం, రైలెక్కడం, భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కు సరిగా ధరించకపోవడం వంటి వాటిని తీవ్రంగా పరిగణించనున్నట్టు స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తికి కారణమయ్యే ఎటువంటి పనులు చేసినా నేరం కిందే పరిగణించి జరిమానా విధిస్తామని, జైలు శిక్ష కూడా తప్పదని ఆర్‌పీఎఫ్ అధికారులు హెచ్చరించారు.


More Telugu News