వరద పరిస్థితి నుంచి తెలుగు రాష్ట్రాలు త్వరగా కోలుకోవాలి: హర్షాభోగ్లే
- తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు
- తెలంగాణలో 24 మంది, ఏపీలో 10 మంది మృత్యువాత
- ట్వీట్ చేసిన కామెంటేటర్ హర్ష
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం కావడంపై ప్రముఖ కామెంటేటర్ హర్షాభోగ్లే స్పందించాడు. వర్షాల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై విచారం వ్యక్తం చేసిన హర్ష.. ఈ పరిస్థితిని త్వరలోనే రెండు రాష్ట్రాలు అధిగమిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడతారని ఆకాంక్షించాడు.
గత మూడునాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏపీ, తెలంగాణలో ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. వేలాది హెక్టార్లలోని పంటలు ధ్వంసమయ్యాయి. ఇక, విజయవాడ, హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణలో 24 మంది, ఏపీలో 10 మంది వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయారు.