రష్యా నుంచి కరోనాకు రెండో టీకా.. వెల్లడించిన పుతిన్
- ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ‘స్పుత్నిక్-వి’
- రెండో టీకాను అభివృద్ధి చేస్తున్న వెక్టార్ ఇనిస్టిట్యూట్
- తొలి దశ హ్యూమన్ ట్రయల్స్ పూర్తి
ప్రపంచంలో అందరికంటే ముందుగా కరోనా టీకా 'స్పుత్నిక్-వి'ని అందుబాటులోకి తీసుకొచ్చి రికార్డు సృష్టించిన రష్యా ఇప్పుడు మరో టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రెడీ అయింది. సైబీరియాకు చెందిన వెక్టార్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ టీకాకు రష్యా రెగ్యులేటరీ అనుమతి ఇచ్చినట్టు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
నిన్న జరిగిన ప్రభుత్వ సమావేశంలో ఈ విషయాన్ని పేర్కొన్న పుతిన్ రెండో టీకా అందుబాటులోకి రానుండడంపై హర్షం వ్యక్తం చేశారు. గత నెల ప్రారంభంలోనే ఈ టీకా తొలి దశ హ్యూమన్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకున్నట్టు చెప్పిన పుతిన్, ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను అభినందించారు. టీకాల ఉత్పత్తిని పెంచేందుకు విదేశీ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్టు అధ్యక్షుడు తెలిపారు.
కరోనా కేసులు అత్యధికంగా నమోదైన దేశాల్లో రష్యా నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు అక్కడ 13,40,409 కేసులు నమోదయ్యాయి. ఈ జాబితాలో అమెరికా 81,50,043 కేసులతో అగ్రస్థానంలో ఉండగా, 73,05,070 కేసులతో ఇండియా రెండోస్థానంలో, 51,41,498 కేసులతో బ్రెజిల్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. 85,622 కేసులతో చైనా 50వ స్థానంలో ఉంది.