యుద్ధానికి సిద్ధంగా ఉండండి: జిన్ పింగ్

  • గ్వాంగ్డాంగ్ మిలిటరీ బేస్ లో జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు
  • పూర్తి శక్తిసామర్థ్యాలను యుద్ధంపైనే కేంద్రీకరించాలని సైనికులకు పిలుపు
  • మనసును కూడా యుద్ధం వైపే మళ్లించాలని పిలుపు
ఓ వైపు నంగనాచి కబుర్లు చెపుతూనే... మరోవైపు యుద్ధం దిశగా చైనా అడుగులు వేస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నిన్న గ్వాంగ్డాంగ్ మిలిటరీ బేస్ ను సందర్శించారు.

ఈ సందర్భంగా అక్కడున్న సైనికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశానికి విధేయంగా పని చేయాలని అన్నారు. మీ పూర్తి శక్తిసామర్థ్యాలను యుద్ధంపైనే కేంద్రీకరించాలని, మీ మనసును సైతం యుద్ధం వైపే నడిపించాలని చెప్పారు. అనుక్షణం అలర్ట్ గా ఉండాలని తెలిపారు. జిన్ పింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు విదేశీ మీడియాలో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి.

అయితే, ఏ దేశాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారో మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం భారత్ తో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో... ఇండియాను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో దక్షిణ చైనా సముద్రం విషయంలో పలు దేశాలతో కూడా చైనాకు విభేదాలు ఉన్నాయి.


More Telugu News