భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సూచనలు
- ప్రతి ఒక్కరూ ప్రజలకు సాయపడాలి
- వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
- సాయపడుతోన్న వాలంటీర్లకు అభినందనలు
నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. హైదరాబాద్ లోని ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పలు సూచనలు చేశారు. ప్రభుత్వంతో పాటు సాయం చేయగలిగే ప్రతి ఒక్కరూ ప్రజలకు సాయపడాలని పిలుపునిచ్చారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు. ప్రజలకు సాయపడుతోన్న వాలంటీర్లను ఆమె అభినందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని ఆమె చెప్పారు. అధికారులు, సిబ్బంది ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, సహాయక చర్యల నిమిత్తం జీహెచ్ఎంసీ సిబ్బంది నిన్నటి నుంచే రంగంలోకి దిగి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు.