జైల్లో ఉరి వేసుకుని.. కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
- కోటి 10 లక్షల లంచం డిమాండ్ చేసిన కేసులో ఇటీవల అరెస్ట్
- ఆయన ఇళ్లల్లో ఏసీబీ సోదాలు
- నెల రోజులుగా అధికారుల విచారణ
కోటి 10 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసిన కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉంటోన్న మాజీ తహసీల్దార్ నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే ఆయన ఇళ్లల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో నగదు, స్థిరాస్తి పత్రాలు, బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు వీఆర్ఏ సాయి రాజ్‌ను కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
19 ఎకరాల 39 గుంటల భూమికి సంబంధించిన సమస్యను క్లియర్ చేయడానికి నాగరాజు లంచం డిమాండ్ చేశాడని అధికారులు గుర్తించి, లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో నెల రోజులుగా ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.