చెన్నైని కట్టడి చేసిన సన్ రైజర్స్ బౌలర్లు
- దుబాయ్ లో సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్
- మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 రన్స్
దుబాయ్ లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తూ, కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ చెన్నైపై ఒత్తిడి పెంచారు. దాంతో భారీ స్కోరు సాధించాలన్న ధోనీ సేన ఆశలు నెరవేరలేదు.
వాట్సన్ (42), రాయుడు (41), శామ్ కరన్ (31) రాణించారు. ధోనీ 13 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ తో 21 పరుగులు చేశాడు. చివర్లో జడేజా 10 బంతుల్లో 25 పరుగులు చేయడంతో చెన్నై జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, నటరాజన్ తలో 2 వికెట్లతో రాణించారు.