ఏపీ సహా 20 రాష్ట్రాలకు అదనపు రుణాల సేకరణకు కేంద్రం అనుమతి
- బహిరంగ మార్కెట్లో రుణ సేకరణకు అవకాశం
- ఏపీకి రూ.5,051 కోట్ల సేకరణకు అనుమతించిన కేంద్రం
- మిగతా 8 రాష్ట్రాలపై త్వరలో నిర్ణయం
కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సహా 20 రాష్ట్రాలకు అదనపు రుణాల సేకరణ నిమిత్తం ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. బహిరంగ విపణి నుంచి అదనపు రుణాలు సేకరించుకునేందుకు తాజా ఉత్తర్వులతో వెసులుబాటు కల్పించింది.
ఇందులో ఏపీకి రూ.5,051 కోట్ల మేర అదనపు రుణాల సేకరణకు కేంద్రం అవకాశం ఇచ్చింది. కాగా, రుణసేకరణ అంశంలో ఆప్షన్-1 ఎంచుకున్న 20 రాష్ట్రాలకు కేంద్రం ఈ మేరకు అనుమతి ఇచ్చింది. మిగతా 8 రాష్ట్రాలపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
అదనపు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిన రాష్ట్రాలు ఇవే..

- ఆంధ్రప్రదేశ్
- ఉత్తరప్రదేశ్
- మహారాష్ట్ర
- బీహార్
- మధ్యప్రదేశ్
- హర్యానా
- కర్ణాటక
- అసోం
- ఒడిశా
- గుజరాత్
- గోవా
- అరుణాచల్ ప్రదేశ్
- ఉత్తరాఖండ్
- త్రిపుర
- సిక్కిం
- హిమాచల్ ప్రదేశ్
- మిజోరాం
- నాగాలాండ్
- మణిపూర్
- మేఘాలయ