స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగిన మార్కెట్లు
  • 32 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 4 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి ఒడిదుడుకుల మధ్య మార్కెట్లు కొనసాగినప్పటికీ చివర్లో గ్రీన్ లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 32 పాయింట్లు లాభపడి 40,626కి చేరుకుంది. నిఫ్టీ 4 పాయింట్లు పెరిగి 11,935 వద్ద స్థిరపడింది. ఎనర్జీ, ఐటీ, టెక్ సూచీలు ఒక శాతానికి పైగా పెరిగాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.94%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.40%), ఇన్ఫోసిస్ (2.27%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.95%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.80%).

టాప్ లూజర్స్:
టైటాన్ కంపెనీ (-2.18%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.91%), బజాజ్ ఫైనాన్స్ (-1.56%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.51%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.26%).


More Telugu News