ఆవుపేడకు రేడియేషన్ ను నిలువరించే శక్తి ఉందంటున్న కామధేను ఆయోగ్ చైర్మన్
- 'గోసత్వా కవచ్' పేరుతో చిప్ తయారు
- ఆవుపేడతో తయారైన చిప్
- మొబైల్ ఫోన్ రేడియేషన్ ను తగ్గించే చిప్ గా ప్రచారం
గోమాతను భారత్ లో హిందువులు పరమపవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాదు, ఆవు పాలు, నెయ్యి, మూత్రం, పేడకు కూడా ఎంతో విశిష్టత ఉందని ప్రజల్లో విశ్వాసం ఉంది. తాజాగా రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చైర్మన్ వల్లభాయ్ కతిరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆవుపేడకు రేడియేషన్ కు అడ్డుకట్ట వేసే సామర్థ్యం ఉందని తెలిపారు. రేడియో ధార్మికతను ఎదుర్కోడమే కాకుండా, దాన్ని తగ్గించే శక్తి కూడా ఆవు పేడకు ఉందని కతిరియా వివరించారు.
ఈ సందర్భంగా ఆయన ఆవుపేడతో తయారైన చిప్ ను మీడియాకు ప్రదర్శించారు. ఈ చిప్ కు 'గౌసత్వా కవచ్' అని నామకరణం చేసినట్టు తెలిపారు. మొబైల్ ఫోన్లలో మాట్లాడేటప్పుడు ఉత్పత్తి అయ్యే రేడియేషన్ ను ఈ చిప్ తగ్గిస్తుందని, తద్వారా రేడియేషన్ ప్రభావంతో వచ్చే వ్యాధులు ప్రజల దరిచేరవని అన్నారు. ఆవుపేడకు రేడియేషన్ ను తగ్గించే శక్తి ఉందని శాస్త్రీయంగా రుజువైందని కూడా తెలిపారు. ఆవుపేడ ఉత్పత్తులను ఇంట్లో ఉంచడం వల్ల ప్రజలు రేడియో ధార్మికత ప్రభావం నుంచి రక్షణ పొందవచ్చని కతిరియా పేర్కొన్నారు.