ప్రభాస్ సినిమాలలో బాలీవుడ్ నటుల కీలక పాత్రలు!
- త్వరలో ప్రభాస్ చేయనున్న రెండు సినిమాలు
- రెండింటిలోనూ ఎన్నో ప్రత్యేకతలు
- 'వైజయంతీ' సినిమాలో అమితాబ్, దీపిక
- 'ఆదిపురుష్'లో సైఫ్ అలీఖాన్, అజయ్ దేవగణ్
త్వరలో ప్రభాస్ చేయనున్న రెండు సినిమాలు టాలీవుడ్ నే కాకుండా, బాలీవుడ్ ని సైతం ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అందులో ఒకటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్నది కాగా, మరొకటి 'ఆదిపురుష్'. రెండూ కూడా పలు ఆకర్షణలు, ప్రత్యేకతలను సంతరించుకుంటున్నాయి. నాగ్ అశ్విన్ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ కాగా, కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు.
ఇక 'ఆదిపురుష్'లో అయితే, ఇప్పటికే ప్రధాన విలన్ గా రావణ్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. అలాగే ఈ చిత్రంలో మరో బాలీవుడ్ నటుడు కూడ నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. అతనే.. అజయ్ దేవగణ్! 'ఆదిపురుష్'లో శివుడి పాత్రలో అజయ్ నటించనున్నట్టు సమాచారం.
అసలు ఇందులో విలన్ పాత్రకు మొదట్లో అజయ్ నే అనుకున్నారనీ, అయితే డేట్స్ సమస్య వల్ల కుదరలేదని, ఇప్పుడు మరో పాత్ర అయిన శివుడి పాత్రకు అడుగుతున్నారని అంటున్నారు. దర్శకుడు ఓమ్ రౌత్ కి అజయ్ మిత్రుడు కావడం వల్ల ఒప్పుకుంటాడని కూడా తెలుస్తోంది.
ఇదిలావుంచితే, ఇప్పటికే అజయ్ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పుడు 'ఆదిపురుష్' కూడా ఓకే అయితే, మరో తెలుగు చిత్రంలో కూడా నటించిన ఘనత అజయ్ కు దక్కుతుంది.