ఢిల్లీకి వెళ్తున్న జగన్.. ఖరారు కాని మోదీ అపాయింట్ మెంట్
- రేపు లేదా ఎల్లుండి హస్తినకు వెళ్తున్న సీఎం
- రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్ మెంట్ కోరిన జగన్
- రాష్ట్ర పరిస్థితులపై చర్చించనున్న ముఖ్యమంత్రి
ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లి ప్రధాని మోదీని కలిసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి హస్తినకు వెళ్తున్నారు. రేపు లేదా ఎల్లుండి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కోరారు. వారం రోజుల వ్యవధిలో ప్రధాని అపాయింట్ మెంట్ ను జగన్ రెండో సారి కోరడం గమనార్హం. మరోవైపు మోదీ అపాయింట్ మెంట్ ఖరారైనట్టు పీఎంఓ నుంచి ఇంకా సమాచారం రాలేదు.
మరోవైపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిపై ఆరోపణలతో ప్రధాన న్యాయమూర్తికి ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై రాష్ట్రపతితో జగన్ చర్చించనున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన ఇతర నిధులపై మోదీతో చర్చించనున్నట్టు సమాచారం.