ఐపీఎల్ లో నేడు బెంగళూరు వర్సెస్ కోల్ కతా
- షార్జాలో మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు
- నరైన్ ను తప్పించిన కోల్ కతా
- ఇంగ్లాండ్ యువకిశోరం టామ్ బాంటన్ కు చోటు
టి20 క్రికెట్ మస్తీకి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే ఐపీఎల్ జనరంజకంగా సాగిపోతోంది. ఈ ఏడాది ఐపీఎల్ భారత్ లో జరగడంలేదన్న వెలితి తప్ప, క్రికెట్ వినోదానికి ఎలాంటి లోటు లేదు. జట్లన్నీ పోటాపోటీగా ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాయి. ఇవాళ పరుగుల స్వర్గం షార్జాలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
అనేక సీజన్ల పాటు నాసిరకం ఆటతీరుతో విమర్శల పాలైన బెంగళూరు ఈసారి విజయాల బాటలో నడుస్తోంది. ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు 4 విజయాలు సాధించింది. అదే ఊపును ఇవాళ్టి మ్యాచ్ లోనూ కొనసాగించాలని భావిస్తోంది. దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ రాకతో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ మరింత పటిష్టమైంది. బెంగళూరు గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలో దిగుతోంది.
ఇక, దినేశ్ కార్తీక్ సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ కూడా ఈ సీజన్ లో మెరుగైన ఆటతీరు కనబరుస్తోంది. అయితే ఆ జట్టు స్టార్ ఆటగాడు సునీల్ నరైన్ బౌలింగ్ పై ఆరోపణలు రావడంతో అతడ్ని ఈ మ్యాచ్ లో తీసుకోలేదు. నరైన్ స్థానంలో ఇంగ్లాండ్ వికెట్ కీపింగ్ బ్యాట్స్ మన్ టామ్ బాంటన్ ను కోల్ కతా జట్టులోకి తీసుకున్నారు. 21 ఏళ్ల బాంటన్ ఓపెనింగ్ సహా ఏ స్థానంలో అయినా ఆడగల సత్తా ఉన్నవాడు! గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన బాంటన్ ఈ మ్యాచ్ తో ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు.