నారా లోకేశ్ ది అసత్య ప్రచారం అంటూ వైసీపీ పోస్టు
- ఇటీవల రాజధానిలో మరణించిన చినలాజర్
- చినలాజర్ మరణంపై లోకేశ్ వ్యాఖ్యలు తప్పన్న కుమార్తె
- వార్త క్లిప్పింగ్ ను పోస్టు చేసిన వైసీపీ
రాజధాని ప్రాంతంలోని ఉద్ధండరాయుని ప్రాంతంలో ఇటీవల చినలాజర్ అనే వ్యక్తి మరణించారు. అయితే తన తండ్రి మరణంపై టీడీపీ నేత నారా లోకేశ్ అసత్య ప్రచారం చేస్తున్నారని చినలాజర్ కుమార్తె మండిపడ్డారంటూ వైసీపీ తన ట్విట్టర్ అకౌంట్ లో మీడియాలో వచ్చిన ఓ వార్త క్లిప్పింగ్ ను పోస్టు చేసింది.
"అమరావతికి భూమిని త్యాగం చేసిన రైతు గుండె ఆగి మరణించారని లోకేశ్ చెప్పినవన్నీ అవాస్తవాలు. నా తండ్రి మరణాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు. నా తండ్రి రాజధాని కోసం కాదు, ఆరోగ్యం బాగాలేక చనిపోయారు. రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలంటే మన స్వార్థం చూసుకోకూడదు అని సీఎం జగన్ నిర్ణయాన్ని మా నాన్న స్వాగతించారు" అంటూ ఆమె వివరించారు.
ఈ క్లిప్పింగ్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వైసీపీ... నారా లోకేశ్ అసత్య ప్రచారం బట్టబయలైందని, తన తండ్రి మృతిపై రాజకీయాలు చేస్తావా అని రాజధాని ప్రాంత యువతి లోకేశ్ పై మండిపడిందని, సోషల్ మీడియా వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేసిందని పేర్కొంది.