మహిళలు టీవీ సీరియళ్లు చూడడం తగ్గించి కాస్త అమరావతిపై దృష్టి పెట్టాలి: రఘురామకృష్ణరాజు
- ఢిల్లీలో రఘురామకృష్ణరాజు 'రచ్చబండ'
- అమరావతి నిరసనలు మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపు
- మహిళలు ముందుంటే ఎక్కడైనా శుభమేనని వెల్లడి
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో తన 'రచ్చబండ' కార్యక్రమం సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రైతులు చేస్తున్న శాంతియుత ధర్నా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సినిమా శతదినోత్సవం, రజతోత్సవం, వజ్రోత్సవం లాగా, అమరావతి ధర్నా 300వ రోజు అంటూ ప్రచారం చేసుకోకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరించడంపై శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు.
ముఖ్యంగా, రాష్ట్రంలోని మహిళలు టీవీ సీరియళ్లు చూసే సమయాన్ని 50 శాతం తగ్గించుకుని, కాస్త అమరావతి రైతుల సమస్యపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఎక్కడైనా మహిళలు ముందుంటే దేనికైనా శుభం జరుగుతుందని రఘురామకృష్ణరాజు అన్నారు. అమరావతి సాధించేంత వరకు మహిళలు విశ్రమించరాదని పిలుపునిచ్చారు.