పెరిగిన బంగారం, వెండి ధరలు!

  • ఇటీవల తగ్గిన బంగారం ధరలు
  • మళ్లీ వరుసగా మూడో రోజు పెరుగుదల
  • పదిగ్రాముల బంగారం ధర రూ.51,078 
  • కిలో వెండి 1,103 రూపాయలు పెరిగి రూ.63,987
ఇటీవల కొన్ని రోజుల పాటు బంగారం ధరలు తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, మళ్లీ పసిడి ధరలు పై పైకి వెళ్తున్నాయి. దేశంలో  బంగారం, వెండి ధరలు వరుసగా మూడోరోజూ పెరిగాయి. పదిగ్రాముల బంగారం ధర మరో 261 రూపాయలు పెరిగి, 51,078 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అలాగే, కిలో వెండి ఒక్కసారిగా 1,103 రూపాయలు పెరిగి, 63,987 రూపాయలుగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు తగ్గుతున్నప్పటికీ డాలర్‌ బలపడటంతో దేశీయ మార్కెట్‌లో మాత్రం పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్‌ బలోపేతం కావడంతో పాటు ఉద్దీపన ప్యాకేజ్‌పై స్పష్టత లేకపోవడంతో ఔన్స్‌ బంగారం స్వల్పంగా తగ్గి 1925 డాలర్లకు చేరింది.


More Telugu News