ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కల్వకుంట్ల కవిత విజయ దుందుభి
- టీఆర్ఎస్‌కు 728 ఓట్లు
- బీజేపీకి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు
- చెల్లని ఓట్లు 10
తాజాగా జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కల‍్వకుంట్ల కవిత విజయ దుందుభి మోగించారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ రోజు నిర్వహించిన కౌంటింగ్ లో టీఆర్ఎస్‌కు 728 ఓట్లు, బీజేపీకి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు రాగా, చెల్లని ఓట్లు 10గా నమోదయ్యాయి. మొత్తం 823 ఓట్లు పోలయ్యాయి. దీంతో భారీ ఆధిక్యంతో కవిత విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ పోటీ చేసిన విషయం తెలిసిందే. కాసేపట్లో కవితకు ఎన్నికల గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అధికారులు అందజేయనున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత గెలుపుతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. కవితకు శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు పంచుకుంటున్నారు.