కవిత గెలుపు లాంఛనమేనా.. ప్రారంభమైన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు

  • రెండు రౌండ్లలో లెక్కింపు
  • మరో రెండు గంటల్లో ఫలితం
  • విజయోత్సవ సంబరాలకు గులాబీ శ్రేణులు రెడీ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితం మరో రెండు గంటల్లో తేలిపోనుంది. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఈ ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ కొనసాగుతోంది.

కౌంటింగ్ కోసం మొత్తం ఆరు టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 823 ఓట్లు పోలయ్యాయి. దీంతో రెండు రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. మొదటి రౌండ్‌లో 600 ఓట్లను లెక్కించనుండగా, రెండో విడతలో  223 ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఫలితాన్ని వెల్లడిస్తారు.

గెలిచిన అభ్యర్థికి మధ్యాహ్నం గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు.  పోలింగ్ సరళిని బట్టి మొదటి ప్రాధాన్య ఓటుతోనే ఫలితం తేలిపోయే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు, టీఆర్ఎస్ అగ్రనేత కల్వకుంట్ల కవిత గెలుపు లాంఛనమేనని నమ్ముతున్న గులాబీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీలకు రెడీ అవుతున్నారు. ఈ ఎన్నికల్లో కవితతోపాటు కాంగ్రెస్ నుంచి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ పోటీలో నిలిచారు.


More Telugu News