ఫ్రెంచ్ ఓపెన్ లో విజయంతో 'ఆల్ టైమ్ గ్రేట్' సరసన నాదల్!
- 20వ గ్రాండ్ స్లామ్ సాధించిన స్పెయిన్ బుల్
- అత్యధిక టైటిల్స్ సాధించిన ఫెదరర్ సరసన
- రూ.13.82 కోట్ల ప్రైజ్ మనీ కూడా
- ఫైనల్స్ లో జకోవిచ్ పై సునాయాస విజయం
స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ 20వ గ్రాండ్ స్లామ్ ను సాధించి, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ సరసన నిలిచాడు. నిన్న జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ లో జకోవిచ్ పై సునాయాస విజయం సాధించడం ద్వారా 13వ సారి ఫ్రెంచ్ ఓపెన్ ను సాధించడంతో పాటు రూ. 13.82 కోట్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ తో స్విస్ దిగ్గజం పేరిట ఉన్న రికార్డును నాదల్ సమం చేశాడు.
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో రెండో సీడ్ జకోవిచ్, ఏ దశలోనూ నాదల్ కు పోటీ ఇవ్వలేకపోయాడు. ఫలితంగా కేవలం 2.41 గంటల వ్యవధిలోనే ముగిసింది. ఈ మ్యాచ్ లో 6-0, 6-2, 7-5 తేడాతో జకోవిచ్ పై నాదల్ విజయం సాధించాడు. ఈ టోర్నమెంట్ మొత్తంలో ప్రత్యర్థులకు ఒక్క సెట్ ను కూడా కోల్పోకుండా నాదల్ టైటిల్ ను సాధించడం గమనార్హం. స్పెయిన్ బుల్ ఈ ఫీట్ ను సాధించడం ఇది నాలుగో సారి.
మ్యాచ్ అనంతరం నాదల్ మాట్లాడుతూ, 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కేవలం ఒక అంకె మాత్రమేనని అభివర్ణించాడు. ఫెదరర్ రికార్డును సమం చేయడం ఆనందంగా ఉందని, ఫ్రెంచ్ ఓపెన్ సాధించడం అంటే, తనకెంతో ఇష్టమని, తన కెరీర్ లోని గొప్ప క్షణాలన్నీ ఇదే మైదానంలో లభించాయని అన్నాడు. పారిస్ నగరంతో, ఫ్రెంచ్ ఓపెన్ తో తనకు ఎంతో ప్రేమానుబంధం ఉందని, అది చిరస్మరణీయమైనదని వ్యాఖ్యానించాడు.
కాగా, నాదల్ సాధించిన 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లో 13 ఫ్రెంచ్ ఓపెన్ లో వచ్చినవే కావడం గమనార్హం. మరొక్క గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధిస్తే, ఫెదరర్ రికార్డును అధిగమించనున్న నాదల్, అత్యధిక టైటిల్స్ లో తొలి స్థానంలో నిలువనున్నాడు.