ఇవాళ బిర్యానీ డే... ఈ ఆఫర్ వింటే తమిళనాడు వెళ్లాలనుకుంటారు!
- పది పైసలకే బిర్యానీ అంటూ సూపర్ డూపర్ ఆఫర్
- కిలోమీటర్ల కొద్దీ క్యూలు
- కరోనా నిబంధనలు కూడా లెక్కచేయకుండా ఎగబడిన జనం
భారత్ లో ఎక్కడికి వెళ్లినా కామన్ గా కనిపించే వంటకం బిర్యానీ. మాంసాహార ప్రియులకు ఎంతో ఇష్టమైన బిర్యానీ సాధారణంగా వంద రూపాయలకు పైనే ధర పలుకుతుంది. అయితే ఇవాళ బిర్యానీ డే సందర్భంగా తమిళనాడులో దిమ్మదిరిగే ఆఫర్లు ప్రకటించారు. కేవలం పది పైసలకే బిర్యానీ అంటూ నమ్మశక్యం కాని ఆఫర్ ఇవ్వడంతో ఆ హోటళ్ల ముందు జనాలు క్యూలు కట్టారు.
చెన్నైలోనే కాదు, మధురై, దిండిగల్, తిరుచ్చి ప్రాంతాల్లోని కొన్ని బిర్యానీ హోటళ్లు కస్టమర్లతో కిక్కిరిసిపోయాయి. పది పైసల బిర్యానీ కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూల్లో నిల్చున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ప్రజలు కరోనా నియమావళి పాటించకుండా పెద్ద ఎత్తున ఎగబడడంతో అందుకు హోటళ్ల యాజమాన్యాలనే బాధ్యుల్ని చేస్తూ మున్సిపల్ అధికారులు కేసులు నమోదు చేశారు.