దళిత రైతులను కూడా మీ ఇనుప పాదం కింద తొక్కుతున్నారు.. న్యాయమా?: వర్ల రామయ్య
- దళిత వర్గాల ఓటు దండుకొని అధికారంలోకి వచ్చారు
- ఆ దళితుల పైన యుద్ధం ప్రకటించారు
- అమరావతి రాజధానిని కాల రాస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. అమరావతి రాజధాని రైతుల పట్ల ఆయన దారుణంగా వ్యవహరిస్తున్నారని వర్ల రామయ్య ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. అమరావతి రాజధాని కోసం రైతులు ఉద్యమం చేస్తుంటే వారిని అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.
‘దళిత వర్గాల ఓటు దండుకొని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, ఆ దళితుల పైన యుద్ధం ప్రకటించారు. దళితుల ఆర్ధిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ప్రాధాన్యత పెంచే అమరావతి రాజధానిని కాల రాస్తున్నారు. 299 రోజులుగా ఉద్యమం చేస్తున్న దళిత రైతులను కూడా మీ ఇనుప పాదం కింద తొక్కుతున్నారు, న్యాయమా?’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు.