ఎన్నికల ప్రచారాన్ని తిరిగి మొదలు పెట్టిన ట్రంప్... మాస్క్ తీసేసి మరీ ప్రసంగం!
- కరోనా తరువాత తొలిసారి ప్రసంగం
- అమెరికాను గొప్పగా నిలబెడుతా
- మరో నాలుగేళ్లు అవకాశం ఇవ్వాలన్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కరోనాకు చికిత్స తరువాత తిరిగి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వందలాది మంది మద్దతుదారులు కేరింతలు పెడుతుండగా, వైట్ హౌస్ వేదికగా, ట్రంప్ తన మాస్క్ ను తీసేసి మరీ ప్రసంగించారు. "నేనిప్పుడు చాలా బాగున్నాను" అని వైట్ హౌస్ బాల్కనీ నుంచి ట్రంప్ ప్రసంగించారు. ట్రంప్ ను చూసేందుకు వచ్చిన వారిలో అత్యధికులు మాస్క్ లను ధరించివుండటం గమనార్హం.
"మరోసారి అమెరికాను గొప్పగా నిలబెట్టేందుకు సిద్ధంగాఉన్నాను. మరొక్క నాలుగేళ్లు నాకు అవకాశం ఇవ్వండి" అని తన 20 నిమిషాల ప్రసంగంలో ఆయన ఓటర్లను కోరారు. కాగా, ప్రస్తుతం ఉన్న సర్వే వివరాల ప్రకారం, 77 సంవత్సరాల డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ కన్నా ట్రంప్ వెనుకంజలో ఉన్నారని తెలుస్తోంది.
కాగా, శనివారం ప్రత్యేక ప్రకటన విడుదల చేసిన వైట్ హౌస్ డాక్టర్, ట్రంప్ కు ఇక పూర్తిగా నయమైనట్టేనని, ఆయన్నుంచి వైరస్ వ్యాపిస్తుందన్న ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆయన శరీరంలో యాక్టివ్ వైరస్ సృష్టించబడుతున్నట్టు ఆధారాలు లేవని పరీక్షల తరువాత నిపుణులు నిర్దారించినట్టు ప్రకటన వెలువడింది.
ఇదిలావుండగా, యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిబంధనల ప్రకారం, స్వల్ప లక్షణాలు కనిపించి, చికిత్స తీసుకున్న వారు, చికిత్స తరువాత 10 రోజులు ఐసోలేషన్ లో ఉండాలన్న నిబంధన కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్, నిబంధనలను అతిక్రమిస్తున్నారన్న విమర్శలూ వస్తున్నాయి.