సుదీర్ఘ సమావేశం తరువాత కీలక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్!

  • జీహెచ్ఎంసీ చట్ట సవరణకు ఆమోదం
  • రిజర్వేషన్ల చట్టానికి కూడా సవరణ
  • ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనాలని నిర్ణయం
నిన్న తన మంత్రివర్గ సహచరులతో సుదీర్ఘ సమావేశాన్ని జరిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ చట్ట సవరణకు ఆమోదం తెలుపడంతో పాటు వార్డుల రిజర్వేషన్ల చట్ట సవరణనూ మంత్రివర్గం ఆమోదించింది. ఇదే సమయంలో నాలా చట్టాన్ని సవరించేందుకూ నిర్ణయించింది.

ఇటీవలి వర్షాలకు నాలాలు పొంగి, తీవ్ర ఆస్తినష్టం సంభవించిన నేపథ్యంలోనే, నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆపై ధాన్యాన్ని గ్రామాల్లోనే స్వీకరించాలని, ఇందుకు అధికారులు సన్నద్ధం కావాలని సూచించింది. ఆస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసుకునే ప్రక్రియను అక్టోబర్ 20 వరకూ పొడిగించాలని నిర్ణయించింది.

 హెచ్ఎండీఏ పరిధిలో ఎన్ ట్రీగ్రేటెడ్ కౌన్సిల్ విధానంపై చర్చించిన కేసీఆర్ మంత్రివర్గం, రిజర్వేషన్ సవరణ చట్టానికి ఆమోదం తెలిపింది. త్వరలో గ్రేటర్ కు జరుగనున్న ఎన్నికల్లో పాత రిజర్వేషన్లనే కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది.


More Telugu News