రోడ్డు పక్కన మట్టిదిబ్బల్లో బంగారు నాణేలు... ఎగబడిన జనం!
- నిలిచిపోయిన ట్రాఫిక్
- నాణేలపై అరబిక్ అక్షరాలు
- ఒక్కో నాణెం 2 గ్రాముల బరువుంటుందని అంచనా
తమిళనాడులోని హోసూరులో రోడ్డు పక్కన ఉన్న మట్టిదిబ్బల్లో బంగారు నాణేలు బయటపడ్డాయి. హోసూరు-బాగలూరు రహదారి వెంట ఉన్న ఆ మట్టి దిబ్బలో బంగారు నాణేలు ఉన్నాయన్న సమాచారంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
స్థానికులతో పాటు రోడ్డుపై వెళ్లే వాహనదారులు కూడా బంగారు నాణేల కోసం పోటీలు పడ్డారు. దాంతో ఆ మార్గంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
కాగా, ఒక్కో నాణెం 2 గ్రాముల బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారు పురాతన నాణేలుగా భావిస్తున్న వీటిపై అరబిక్ లిపిలో అక్షరాలు దర్శనమిస్తున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న హోసూరు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మట్టి దిబ్బల్లోకి బంగారు నాణేలు ఎలా వచ్చాయన్న దానిపై విచారణ జరుపుతున్నారు.