'జగనన్న గారి కానుక' అనేకంటే 'మోదీ-జగనన్న గారి కానుక' అంటే బాగుంటుంది: పవన్ కల్యాణ్
- ఏపీలో జగనన్న విద్యాకానుక అమలు
- కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
- ఇందులో కేంద్రం వాటా 60 శాతం అని పవన్ వెల్లడి
ఏపీ సీఎం జగన్ ఇటీవలే పుస్తకాలు, యూనిఫాంలతో కూడిన కిట్ బ్యాగులను విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీన్ని 'జగనన్న విద్యా కానుక' పేరుతో వైసీపీ ప్రభుత్వం బాగా ప్రచారం చేస్తోంది.
అయితే, దీన్ని 'జగనన్న గారి కానుక' అనేకంటే కూడా 'మోదీ-జగనన్న గారి కానుక' అంటే బాగుంటుంది అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. అందుకు గల కారణం కూడా పవన్ వివరించారు. ఈ పథకంలో 60 శాతం కేంద్ర నిధులు ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రం వాటా 40 శాతమేనని పేర్కొన్నారు. అంతేకాదు, దీనికి సంబంధించిన ఆధారాన్ని కూడా పవన్ ట్విట్టర్ లో పంచుకున్నారు.