ఈ రెండు రకాల వ్యక్తులకు ఓటు హక్కును తొలగించాలి: విజయ్ దేవరకొండ

  • లిక్కర్ కు అమ్ముడుపోయే వారికి ఓటు అనవసరం
  • బాగా డబ్బున్న వాళ్లకు కూడా ఓటు హక్కు తొలగించాలి
  • చదువుకున్న మధ్యతరగతి వారికి మాత్రమే ఓటు హక్కు ఉండాలి
మన దేశంలో ఓటర్లు డబ్బుకు, లిక్కర్ కు అమ్ముడుపోవడం, రాజకీయ నాయకులు మందు, డబ్బుతో ఓటర్లను కొనడం సాధారణ విషయంగా మారిపోయింది. ఎన్నికల సమయంలో వేలాది కోట్ల రూపాయలను నీళ్ల మాదిరి ఖర్చు చేస్తుంటారు. ఇక మద్యం ప్రవాహానికైతే అడ్డూఅదుపూ ఉండదు. ఈ దారుణ పరిస్థితిపై యంగ్ హీరో విజయ్ దేవరకొండ అసహనం వ్యక్తం చేశాడు.

వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని విజయ్ చెప్పాడు. లిక్కర్ కోసం ఓటును అమ్ముకునే వ్యక్తులకు ఓటుహక్కును తొలగించాలని అన్నాడు. డబ్బు కోసం ఓటును అమ్ముకునే వారికి... ఓటుకు ఉన్న విలువ ఏమిటో తెలియదని... అలాంటి వారికి ఓటు హక్కును తొలగించడమే సరైన చర్య అని తెలిపాడు. బాగా డబ్బున్న వాళ్లకు కూడా ఓటు హక్కు అనవసరమని చెప్పాడు. చదువుకున్న, ఓటు విలువ తెలిసిన మధ్య తరగతి వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఫిలిం క్రిటిక్స్ అనుపమ చోప్రా, భరద్వాజ్ రంగన్ లతో చిట్ చాట్ సందర్భంగా మాట్లాడుతూ విజయ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. మరోవైపు విజయ్ అభిప్రాయంతో కొందరు ఏకీభవిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నాారు.


More Telugu News