కరోనా పరీక్షలకు నిరాకరించిన హత్రాస్ మృతురాలి కుటుంబీకులు
- మృతురాలి బంధువుల్లో ఒకరికి కరోనా లక్షణాలు
- కోవిడ్ టెస్టులు చేసేందుకు వెళ్లిన వైద్య బృందం
- అక్కడకు వెళ్లిన పోలీసులు, జర్నలిస్టులు, నేతలకు కరోనా
హత్రాస్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం, ఆ తర్వాత ఆమె మృతి ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. రేపిస్టులను ఎన్ కౌంటర్ చేయాలంటూ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
మరోవైపు, కరోనా పరీక్షలు చేయించుకోవడానికి మృతురాలి కుటుంబీకులు నిరాకరించారు. కుటుంబసభ్యుల్లో ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో... అందరికీ కోవిడ్ టెస్టులు చేసేందుకు ఒక వైద్య బృందం అక్కడకు వెళ్లింది. అయితే, పరీక్షలు చేయించుకోవడానికి వారందరూ నిరాకరించారని వైద్యుడు తెలిపారు.
హత్రాస్ కు వెళ్లిన పోలీసులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులలో చాలా మంది కరోనా బారిన పడ్డారు. సెప్టెంబర్ 14న మృతురాలు సామూహిక అత్యాచారానికి గురైంది. తీవ్రమైన గాయాలలో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో రెండు వారాల పాటు మృత్యువుతో పోరాటం చేసి, చివరకు ప్రాణాలు విడిచింది.