పాశ్వాన్ భౌతికకాయాన్ని చూసి భోరున విలపించిన మొదటి భార్య
- పాశ్వాన్ భౌతికకాయం పాట్నా తరలింపు
- స్వగ్రామం నుంచి పాట్నా వచ్చిన పాశ్వాన్ మొదటి భార్య
- రాజ్ కుమారి దేవిని మొదటి వివాహం చేసుకున్న పాశ్వాన్
కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. పార్టీ శ్రేణులు, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని పాట్నాలోని స్వగృహానికి తరలించారు. ఈ నేపథ్యంలో, పాశ్వాన్ మొదటి భార్య రాజ్ కుమారి దేవి కూడా స్వగ్రామం నుంచి పాట్నా వచ్చారు. విగతజీవిగా ఉన్న పాశ్వాన్ ను చూడగానే ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకుంది. గుండెలవిసేలా బిగ్గరగా రోదించారు. ఈ దృశ్యం అక్కడున్న వారందరినీ కలచివేసింది.
పాశ్వాన్ కు 14 ఏళ్ల వయసులోనే రాజ్ కుమారి దేవితో వివాహం జరిగింది. పెళ్లి నాటికి రాజ్ కుమార్ దేవి వయసు 13 ఏళ్లు. వారికి ఆశా అనే కుమార్తె ఉంది. పాశ్వాన్ ఎంపీ అయ్యేంతవరకు సజావుగా సాగిన వారి దాంపత్యం ఆ తర్వాత విచ్ఛిన్నమైంది. అప్పటికి వారి కుమార్తె ఆశా ఏడేళ్ల అమ్మాయి.
1983లో పాశ్వాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. రీనా శర్మను పెళ్లాడిన ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె కలిగారు. కుమారుడు చిరాగ్ ఇప్పుడు పాశ్వాన్ కు రాజకీయ వారసుడిగా ఉన్నారు. చిరాగ్ పాశ్వాన్ జుమాయి ఎంపీగా, ఎల్జేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.