నువ్వు దుబారా గురించి మాట్లాడుతున్నావా?: విజయసాయికి బుద్ధా వెంకన్న కౌంటర్
- జగన్ 43 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేశారు
- 6 నెలలు చిప్పకూడు తిన్నారు
- ఆయనను విజన్ ఉన్న నాయకుడు అంటారా?
- మొత్తం లెక్క తీస్తే 10 పోలవరం ప్రాజెక్టులు కట్టవచ్చు
గత టీడీపీ పాలనలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల డబ్బును దుబారా చేశారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయసాయిరెడ్డికి టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వమే డబ్బును దుబారా చేస్తోందని ఆయన ప్రతి విమర్శ చేశారు.
‘43 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేసి,16 నెలలు చిప్పకూడు తిన్న వైఎస్ జగన్ గారిని విజన్ ఉన్న నాయకుడు అంటారా విజయ సాయిరెడ్డి? పోలవరం యాత్రకు ధనం వృథా చేసి ఉంటే మీ సైకో బ్యాచ్ ఊరుకుంటుందా? పోలవరం అనేది 7 దశాబ్దాల రాష్ట్ర ప్రజల కల. 70 శాతం చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు కాబట్టి కల సాకారం అవుతున్న దృశ్యాన్ని ప్రజలకు చూపించారు. ఇక మీ లాగా ఢిల్లీ వాళ్లకు 'ఫుట్ మసాజ్' చేయకుండా, రాష్ట్ర సమస్యలపై కేంద్రంతో పోరాడారు’ అని ఆయన ట్వీట్లు చేశారు.
‘స్కూల్ పిల్లలు వేసుకునే బెల్ట్ కి, సాక్స్ కి వైసీపీ రంగులు వేసుకునే నువ్వు దుబారా గురించి మాట్లాడుతున్నావా? అన్నట్టు 4 వేల కోట్ల రూపాయలతో పంచాయతీలకు వైకాపా రంగుల దుబారా మర్చిపోయావా? తాడేపల్లి ఇంటి కోసం రూ.16 కోట్లు, నాయన సమాధి కోసం రూ.27 కోట్లు, చచ్చు సలహాలు ఇచ్చే సలహాదారులకు 60 కోట్లు, సీబీఐ కోర్టుకు వెళ్లడానికి ప్రతి వారం 60 లక్షల రూపాయలు, మీ కక్షలు తీర్చుకోవటానికి లాయర్ల ఫీజులంటూ వందల కోట్ల రూపాయలు, మీ అవినీతి పత్రికకు వందల కోట్ల రూపాయలు, మీరు చేసే వేల కోట్ల రూపాయల దందాలు, మొత్తం లెక్క తీస్తే, 10 పోలవరం ప్రాజెక్టులు కట్టవచ్చు’ అని బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు.