ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల.. ఇంజనీరింగ్ లో వి.సాయినాథ్ కు తొలి ర్యాంకు

  • manabadi.co.in, sche.ap.gov.in లో ఫలితాలు
  • ఇంజనీరింగ్ లో అర్హత పొందిన 84.78 శాతం మంది విద్యార్థులు 
  • వ్యవసాయ, ఫార్మా పరీక్షల్లో 91.77 శాతం మందికి అర్హత
ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్‌-2020 ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. http://www.results.manabadi.co.in, sche.ap.gov.in లో ఫలితాలను చూసుకోవచ్చు.  ఆన్‌లైన్‌ (సీబీటీ) విధానంలో జరిగిన ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు ఏపీలోని 47 నగరాల్లోని 118 కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.

సెప్టెంబర్‌ 17వ తేదీ నుంచి 25 వరకు ఉదయం, మధ్యాహ్నం మొత్తం 14 సెషన్లలో పరీక్షలు జరిగాయి. ఇంజనీరింగ్ కు మొత్తం 1,56,899 మంది పరీక్షలు రాయగా 84.78 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. వ్యవసాయ, ఫార్మా పరీక్షలకు 75,834 మంది హాజరుకాగా, వారిలో 91.77 శాతం మంది అర్హత సాధించారు.

ఇంజనీరింగ్ లో విశాఖకు చెందిన వి. సాయినాథ్ తొలి ర్యాంకు, హైదరాబాద్ కు చెందిన కుమార్ సత్యం రెండో ర్యాంకు సాధించారు. వ్యవసాయ, ఫార్మాలో గుంటూరుకు చెందిన గుత్తి చైతన్య సింధు తొలి ర్యాంకు, అదే జిల్లాకు చెందిన త్రిపురనేని లక్ష్మీసాయి మారుతి రెండో ర్యాంకు సాధించారు. కాగా, కౌన్సెలింగ్ ప్రక్రియ షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.


More Telugu News