పాకిస్థాన్‌లో ప్రముఖ గాయకుడిని కాల్చి చంపిన దుండగులు

  • ఇంటి బయట విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా ఘటన
  • బైక్‌పై వచ్చి కాల్పులు జరిపి పరారు
  • హత్యకు గురైన సింగర్ హక్కుల కార్యకర్త తండ్రి
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ గాయకుడు హనీఫ్ చమ్రోక్ దారుణ హత్యకు గురయ్యాడు. నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్సులోని టర్బాట్ పట్టణంలో జరిగిందీ  ఘటన. హనీఫ్ గురువారం తన ఇంటి బయట విద్యార్థులకు సంగీత పాఠాలు చెబుతున్న సమయంలో బైక్‌పై వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన హనీఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

మహిళా హక్కుల కార్యకర్త తయ్యబా బలోచ్‌కు హత్యకు గురైన హనీఫ్ తండ్రి కావడం గమనార్హం. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ పాకిస్థానీ భద్రతా దళాలు తరచూ బలూచ్ వాసులను నిర్బంధిస్తుండడంపై తయ్యబా తరచూ గొంతెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రిని కాల్చి చంపడంపై అనుమానాలు బలపడుతున్నాయి. అయితే, ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


More Telugu News