హత్రాస్ బాధిత కుటుంబం ఇంటి వద్ద 60 మంది పోలీసులతో పహారా
- బాధిత కుటుంబం, సాక్షులకు పోలీసుల భద్రత
- సీసీ కెమెరాల ఏర్పాటు
- అవసరమైతే గ్రామంలో కంట్రోల్ రూమ్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ హత్యాచార బాధితురాలి ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 60 మంది నిత్యం పహారా కాస్తున్నారు. వీరిలో మహిళా పోలీసులు కూడా ఉన్నారు. బుల్గరిలోని బాధిత కుటుంబం ఇంటి వద్ద 8 సీసీటీవీ కెమెరాలను బిగించారు. అంతేకాదు, అవసరమైతే గ్రామంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయాలని పోలీసులు నిర్ణయించారు.
బాధిత కుటుంబంతోపాటు ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారికి పోలీసులు షిఫ్టుల వారీగా భద్రత కల్పిస్తారని హత్రాస్ ఎస్పీ వినీత్ జైశ్వాల్ తెలిపారు. బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించే వారి కోసం ప్రత్యేకంగా ఓ రిజస్టర్‌ను కూడా పెట్టినట్టు చెప్పారు. డీఐజీ షాలాభ్ మాథుర్‌ను లక్నో నుంచి హత్రాస్‌కు నోడల్ అధికారిగా పంపినట్టు అధికారులు తెలిపారు.