తప్పులో కాలేసిన ఫ్లిప్ కార్ట్... ఆపై క్షమాపణ!
- నాగాలాండ్ కు ఎందుకు డెలివరీ చేయరన్న వినియోగదారుడు
- భారత్ వెలుపల సేవలకు అమ్మకందార్లు అంగీకరించడంలేదన్న ఫ్లిప్ కార్ట్
- ఏకిపారేసిన నెటిజన్లు
- తప్పు దిద్దుకుంటున్నట్టు ప్రకటన
ప్రముఖ ఆన్ లైన్ విక్రయాల సంస్థ ఫ్లిప్ కార్ట్ ఊహించని విధంగా పొరపాటు చేసింది. నాగాలాండ్ రాష్ట్రాన్ని భారత్ వెలుపలి భాగంగా పేర్కొని, ఆ వెంటనే తప్పు దిద్దుకుంది. నాగాలాండ్ కు ఎందుకు వస్తువులు డెలివరీ చేయడంలేదని ఓ వినియోగదారుడు ఫ్లిప్ కార్ట్ ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు.
అందుకు ఫ్లిప్ కార్ట్ బదులిస్తూ... అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నాం. మా వద్ద షాపింగ్ చేయాలన్న మీ ఆసక్తిని అభినందిస్తున్నాం. అమ్మకందారులు మా సేవలను భారతదేశం వెలుపల అందించడంలేదు అని పేర్కొంది.
ఈ ట్వీట్ నెటిజన్లను ఆగ్రహావేశాలకు గురిచేసింది. నాగాలాండ్ భారత భూభాగమేనన్న విషయంపై అవగాహన లేకుండా ట్వీట్ చేసిన ఫ్లిప్ కార్ట్ ను ఏకిపారేశారు. దాంతో ఫ్లిప్ కార్ట్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. తాము పొరబాటు చేశామని అంగీకరించి క్షమాపణలు తెలిపింది. నాగాలాండ్ లోని ప్రాంతాలతో సహా దేశం మొత్తం తమ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని వివరించింది.