బెడిసికొట్టిన సహజీవనం... కరీంనగర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడి అరెస్ట్
- మహిళా కార్యకర్తతో బాస సత్యనారాయణ రాసలీలలు
- సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియో
- సత్యనారాయణను సస్పెండ్ చేసిన బండి సంజయ్
కరీంనగర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళను సహజీవనం పేరిట మోసం చేశారన్న ఆరోపణలపై ఆయనను కరీంనగర్ టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడాదిగా సత్యనారాయణరావు తనతో సహజీవనం చేశారని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట తప్పారని ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు స్పందించారు. బాస సత్యనారాయణపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈయనను కోర్టులో హాజరు పర్చగా, అక్టోబరు 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సత్యనారాయణరావు ఓ మహిళా కార్యకర్తతో సన్నిహితంగా ఉన్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఈ వీడియోనే ఆయన కొంపముంచింది. ఇది క్రమశిక్షణ ఉల్లంఘన, అనైతిక ప్రవర్తనగా భావించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే చర్యలు తీసుకున్నారు. క్రమశిక్షణ చర్యల కింద ఆయనను కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలను గంగాడి కృష్ణారెడ్డికి అప్పగించారు.