బెజవాడలో కుంభవృష్టి... నగరం జలమయం!
- ఈ సాయంత్రం మొదలైన వాన
- గంట పాటు కురిసిన వర్షం
- లోతట్టు ప్రాంతాలు జలమయం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. తాజాగా విజయవాడలో కుండపోతగా వర్షం కురిసింది. ఈ సాయంత్రం మొదలైన వర్షం గంట పాటు జోరుగా కురిసింది. దాంతో బెజవాడ ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. బందరు రోడ్, పాలీ క్లినిక్ రోడ్, ఎంజే నాయుడు ఆసుపత్రి రోడ్ సహా అనేక ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బైకర్లు, ఇతర వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విజయవాడ అండర్ బ్రిడ్జి వద్ద భారీగా నీళ్లు నిలిచాయి. భారతీ నగర్, వాంబే కాలనీ, ఆర్టీసీ కాలనీలో రోడ్లు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో అపార్ట్ మెంట్ సెల్లార్లలోకి కూడా వర్షపు నీరు ప్రవేశించింది. డ్రైనేజీలు పొంగిపొర్లుతుండడంతో పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది.