సినీ జీవితానికి బై చెబుతున్నా.. ఇక నటించను: హీరోయిన్ సనాఖాన్
- జీవితమంటే డబ్బు సంపాదించడం కోసమేనా?
- ఈ ప్రశ్న నా మదిలో మెదిలింది
- నిస్సహాయులకు సాయం చేయాలి
- చనిపోయాక మంచి జీవితం పొందడం కోసమే ఈ జీవితం
- సేవ చేయాలన్నదే ఆ దేవుడి ఆజ్ఞ
తెలుగులో ‘కత్తి’, ‘మిస్టర్ నూకయ్య’ వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటి సనా ఖాన్.. సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతున్నానని షాకింగ్ ప్రకటన చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖను పోస్ట్ చేశారు. అందులో భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో అత్యంత కీలకమైన విషయం గురించి చెబుతున్నానని, కొన్నేళ్లుగా తాను సినీ పరిశ్రమలో ఉన్నానని, అభిమానుల ఆశీర్వాదాలతో ఇక్కడ తాను పేరు, డబ్బు, గౌరవం సంపాదించుకున్నానని తెలిపారు.
అయితే, ఓ మనిషి ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టేది కేవలం డబ్బు, పేరు కోసమేనా? అంటూ తనలో ఆలోచన మొదలైందని చెప్పుకొచ్చారు. సహాయం అవసరమైన వారికి సేవ చేయడం అవసరం కాదా? అనిపించిందని తెలిపారు. ఒకవేళ మనిషి ఏ క్షణంలోనైనా మరణిస్తే అనంతరం ఏం జరుగుతుందని పేర్కొన్నారు. తాను చాలా కాలంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నానని, తాను చనిపోయాక ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలనుందని చెప్పారు.
దీనికి తన మతంలోనే సమాధానం లభించిందని చెప్పారు. చనిపోయాక మంచి జీవితం పొందడం కోసమే ఈ జీవితమని, ప్రస్తుత జీవితాన్ని నిస్సహాయులకు సేవ చేయాలన్నదే దేవుడి ఆజ్ఞ అని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాను సినీ జీవితానికి శాశ్వతంగా గుడ్‌బై చెబుతున్నానని పేర్కొన్నారు. ఆమె పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు.