హీరోయిన్ కంగనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కర్ణాటక కోర్టు ఆదేశాలు జారీ
- వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఇటీవల రైతుల ఆందోళనలు
- రైతులను ఉద్దేశిస్తూ కంగన అనుచిత వ్యాఖ్యలు
- తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ట్వీట్ డిలేట్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన ఓ ట్వీట్ కలకలం రేపింది. అన్నదాతలపై ఆమె ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసింది.
దీనిపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఆ ట్వీట్ ను డిలేట్ చేసింది. దానిపై స్పందిస్తూ.. తాను రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని మరో ట్వీట్ లో తెలిపింది. కాగా, ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల కొందరు కర్ణాటకలోని ఓ కోర్టులో కేసులో వేసి, ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కంగనా రనౌత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.