నిమిషంలో కరోనాను నిర్ధారించే విధానాన్ని అభివృద్ధి చేసిన భారత్-ఇజ్రాయెల్
- తుది దశకు చేరుకున్న ప్రయోగం
- త్వరలోనే అందుబాటులోకి కొత్త ర్యాపిడ్ టెస్ట్ విధానం
- గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం
కరోనా వైరస్ ఎంతమందిలో ఉందో తెలుసుకుని దాన్ని కట్టడి చేయడం, రోగులను సురక్షితంగా ఉంచడం సవాలుతో కూడుకున్న పని. కరోనాను వీలైనంత త్వరగా కచ్చితంగా గుర్తించేందుకు పరిశోధకులు అనేక పద్ధతులు, పరికరాలు కనిపెట్టారు. రాపిడ్ యాంటీజన్ టెస్ట్ ద్వారా కేవలం 15 నిమిషాలలోపే ఫలితాన్ని చెప్పేస్తున్నారు. అయితే, కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో పరీక్షల కోసం రోగులు భారీ లైన్లలో నిలబడాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో కరోనా ఫలితాన్ని ఒక్క నిమిషంలో రాబడితే మరింత సౌలభ్యంగా ఉంటుంది. భారత్-ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు కలిసి రూపొందించిన ఇలాంటి నూతన విధానం ప్రయోగాల్లో తుది దశకు చేరుకుందని ఇజ్రాయిల్ విదేశాంగశాఖ తెలిపింది. ఈ ర్యాపిడ్ టెస్ట్ విధానం త్వరలోనే అందుబాటులోకి రానుందని పేర్కొంది. వైరస్ ను కచ్చితంగా, వేగంగా గుర్తించేందుకు ఇప్పటికే ఇరు దేశాల పరిశోధకులు కలిసి అధ్యయనం చేశారని చెప్పింది.
బ్రీత్ అనలైజర్, వాయిస్ టెస్ట్ వంటి నాలుగు విభిన్న పరిజ్ఞానాలను పరిగణనలోకి తీసుకుని, వీటి ద్వారా వేలాది శాంపిళ్లను పరీక్షించి ఫలితాలను విశ్లేషించగా కచ్చితంగా ఫలితమిచ్చే ఓ విధానాన్ని గుర్తించినట్లు తెలిపింది. అంతేగాక, లాలాజలంలో కరోనాను గుర్తించే ఐసోథర్మల్ టెస్టింగ్‌పై కూడా పరిశోధన జరిపామని చెప్పారు.
త్వరలోనే ఒక్క నిమిషంలో కరోనాను గుర్తించే విధానాన్ని తీసుకురానున్నామని అధికారికంగా ఇజ్రాయెల్ ప్రకటించింది. కరోనా పరీక్షల్లో ఇది గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉందని చెప్పింది. ఈ విధానాన్ని 'ఓపెన్ స్కై' అని పిలుస్తారని, ట్యూబ్‌లో వ్యక్తి ఊదాల్సి ఉంటుందని, అనంతరం 30 నుంచి 50 సెకన్లలోనే కరోనా ఫలితం వస్తుందని వివరించింది.