పియూష్ గోయల్ కు అదనపు శాఖల బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు
- నిన్న సాయంత్రం కన్నుమూసిన పాశ్వాన్
- పియూష్ గోయల్ కు ఆయన శాఖల బాధ్యతలు
- ఉత్తర్వులు వెలువరించిన రాష్ట్రపతి
కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ నిన్న సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో అంతకు ముందు ఆయన నిర్వహించిన శాఖల బాధ్యతలను రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ కు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు వెలువరించింది. ప్రధాని సలహా మేరకు గోయల్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు.