అమితాబ్ బచ్చన్ తో కలిసి నటిస్తుండడంపై ప్రభాస్ స్పందన!
- వైజయంతీ మూవీస్ బ్యానర్ పై కొత్త సినిమా
- బిగ్ బీతో నటిస్తుండడంతో తన కల నిజం కాబోతోందన్న ప్రభాస్
- ఈ సినిమాలో నటిస్తున్నందుకు గర్వంగా భావిస్తున్నానన్న బిగ్ బీ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించనున్న సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నట్లు ఆ సినిమా యూనిట్ నేడు ప్రకటించిన విషయం తెలిసిందే.
అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో బిగ్ బీతో నటిస్తున్నందుకు ప్రభాస్ హర్షం వ్యక్తం చేశాడు. ఎట్టకేలకు తన కల నిజం కాబోతోందని, దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌తో కలిసి తాను నటించబోతున్నానని ప్రభాస్ పోస్ట్ చేశాడు.
కాగా, ఈ సినిమాలో నటిస్తున్నందుకు అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటిస్తున్నందుకు గాను తాను గర్వంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. వైజయంతి మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. మరో 50 ఏళ్లపాటు వారి సేవలు అందాలని ఆకాంక్షించారు.